Monday, November 25, 2024

ఫుడ్ పాయిజన్ కు చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిమ్స్ లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న కుమురం భీం జిల్లా వాంకిడి ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని శైలజ(16) మృతి చెందింది. అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో నవంబర్ 5న పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు బాలికలు పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశారు. కానీ తొమ్మిదో తరగతి విద్యార్థిని సి.శైలజ(16) వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. విద్యార్థిని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపై మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పందించారు. ‘‘ఆమె మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఆమె కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News