Monday, December 23, 2024

బస్సులో 67 మందిని కాపాడిన బాలుడు..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలో ఓ బాలుడు స్కూల్‌ బస్సులోని తోటి విద్యార్థులు 67 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడి, హీరో అయ్యాడు. ఏడవ తరగతి చదువుతున్న బాలుడు డిలియన్ రీవ్స్ స్కూల్ బస్సులో మిచిగాన్ నగరంలో వెళ్లుతుండగా ఉన్నట్లుండి బస్సు లేడీ డ్రైవర్ ఉన్నట్లుండి సీట్లోనే స్పృహ తప్పి ఒరిగిపోతున్న విషయాన్ని గమనించిన ఈ బాబు వెంటనే ముందు వెనుకా ఆలోచించకుండా డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ సురక్షిత స్థానానికి బస్సును చేర్చాడు. డ్రైవర్‌కు రెండు మూడు వరుసల వెనుక సీట్లో ఉన్న ఈ బాబు డ్రైవర్ పరిస్థితిని గమనించి రంగంలోకి దిగాడు. బస్సును ఓ వైపు సవ్యమైన స్థితిలోకి తీసుకువస్తూనే అత్యవసర సహాయ నెంబరు 911కు ఫోన్ చేయండని తోటి బాలలకు చెప్పాడు.అప్పటికే బస్సులోపల బాలల కేకలు ఏమవుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read:  చారకొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసిబి దాడులు

అయితే ఈ బాబు చాకచక్యంతో , అత్యంత ధైర్యసాహసాలతో వ్యవహరించి పిల్లల ప్రాణాలను రక్షించాడు, బస్సు ప్రమాదానికి గురై గందరగోళం తలెత్తకుండా చేశాడు. బనెర్ట్ రోడ్ వద్ద మసోనిక్ బౌలెవర్డ్ వద్ద బస్సు ముప్పు తప్పి కుదుటపడింది. సంబంధిత బస్సు దృశ్యాలు ఈ బస్సును ఈ బాబు కంట్రోలులో పెడుతున్న ఘట్టం అంతా వీడియోలో చిత్రితం అయ్యి ఇప్పుడు టీవీఛానల్స్‌లో ప్రసారం అయింది. వారెన్ కన్సోలిడెటెడ్ స్కూల్ బస్సునడిపే లేడి డ్రైవర్ తనకు ఏదో అవుతోందని పడిపోతున్నానని చెప్పడం, ఇది వినగానే ఈ బాబు వెంటనే స్పైడర్‌మెన్‌గా వ్యవహరించి బస్సులోని వారందరిని రక్షించి శభాష్‌లు దక్కించుకుంటున్నాడు.ఇంతకు ఈ బస్సు నడిపిన డ్రైవర్ ఎందుకు కళ్లు తిరిగిపడిపోయినట్లు? మద్యం తీసుకుని బస్సునడిపారా? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. బాబును అభినందిస్తూ స్కూల్‌లో పెద్ద సభ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News