Monday, January 20, 2025

జాతీయ స్థాయికి నాగర్‌కర్నూల్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి సిహెచ్ అంజి జాతీయ స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికయ్యారు. అదే విధంగా రాష్ట్రస్థాయి పోటీలలో రాయలగండి కేజిబివి విద్యార్థిని అంకిత ద్వితీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం డిఈఓ గోవిందరాజులు, సెక్టోరల్ అధికారి సతీష్ కుమార్‌లు విద్యార్థి అంజి, విద్యార్థిని అంకితలను అభినందించారు. జనవరి 3 నుంచి 7 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు జరగనున్నాయి.

అయితే జిల్లా నుంచి ప్రథమ స్థానం సాధించి ఈ నెల 6, 7 తేదిలలో రాష్ట్రస్థాయిలో సిసిఆర్‌టి మాదాపూర్‌లో జరిగిన పోటీలలో 33 జిల్లాల విద్యార్థులు పాల్గొనగా అందులో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అంజి జానపద నృత్యంలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. అలాగే త్రిడి పెయింటింగ్‌లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన అమ్రాబాద్ మండలం కేజిబివి విద్యార్థిని అంకితను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.

కళా ఉత్సవ్ పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలను విజయవంతంగా పాల్గొనేలా అవకాశం కల్పించిన సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్‌ను డిఈఓ అభినందించారు.జాతీయ స్థాయిలో కూడా ప్రథమ స్థానం సాధించి కవులకు, కళాకారుల నిలయమైన నాగర్‌కర్నూల్ జిల్లా ఘనతను జాతీయ స్థాయిలో నిరూపించాలని డిఈఓ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News