Saturday, November 23, 2024

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 12 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్ విద్యార్థిని ముస్కు దివ్య ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ.. పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన ముస్కు దివ్య మోడల్ స్కూల్‌లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుందని తెలిపారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జూనియర్ ఖోఖో పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరుపున దివ్య పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించిందని చెప్పారు. ఈ నెల 26 నుంచి 30 వరకు కలకత్తాలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు దివ్య ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ స్థాయికి దివ్య ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నూరుద్దీన్, ఉపాధ్యాయులు వడ్లకొండ రాజేశ్, యాకాంబ్రం, వ్యాయామ ఉపాధ్యాయులు తాళ్ల వరప్రసాద్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News