Monday, January 20, 2025

ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నల్గొండ : పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని ఆశించి కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇప్పుడున్న సమాజంలో సెల్ ఫోన్ భూతం ఒక విద్యార్థిని నిండు ప్రాణం తీసింది. నల్గొండ రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సతీష్ నగర్ లో నివాసముంటున్న పొడిసిరి పుష్ప చంద్రయ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వారికి ఒక కూతురు కిరణ్మయి (14) 9వ తరగతి చదువుతున్నది. కుమారుడు ఉదయ్ ఉన్నారు. బుధవారం ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో కూతురు కిరణ్మయి ఫోన్ చూస్తూ చదువు పై శ్రద్ధ వహించట్లేదని తల్లి మందలించగా మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తల్లి పొడిసిరి పుష్ప దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నామని రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News