Sunday, December 22, 2024

ప్రియురాలి గొంతు కోసిన ఇంజనీరింగ్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియురాలి గొంతు కోసి ప్రియుడు హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హస్సన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యువతి, యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. తేజాస్ అనే యువకుడితో యువతికి పరిచయం ఉండడంతో ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో మాట్లాడుకుందామని యువతిని యువకుడు పిలిచాడు. ప్రియురాలిని ప్రియుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతు కోసి హత్య చేసి అక్కడిని నుంచి పారిపోయాడు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News