Friday, December 20, 2024

ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు తోటి విద్యార్థి కత్తిపోట్లకు గురై ఆ తరువాత మృతి చెందాడు. ఆదివారం సౌత్‌క్యాంపస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు క్లాసు తరువాత వెళ్లుతుండగా ముగ్గురు మధ్య ఏదో విషయంపై వివాదం జరిగింది. దీనితో ఓ విద్యార్థి కత్తితీసి పొడవడంతో ఈ విద్యార్థి బలి అయ్యాడు. ఢిల్లీ వర్శిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఓపెన్ వర్శిటీ రెండో సెమిస్టర్ క్లాసులు జరుగుతున్నాయి.

నిందితుడిని గుర్తించామని, పట్టుకునేందుకు యత్నిస్తున్నామని, ఇరువురు నడుమ ఎందుకు గొడవ జరిగిందనేది ఆరా తీస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరు విద్యార్థులు క్లాసురూంలోనే కొట్లాటకు దిగారని, అక్కడనే విద్యార్థి కత్తిపోట్లకు గురై చనిపోయ్యాడని కొన్ని వార్తలు వెలువడ్డాయి. అధికారులు దీనిని ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News