- Advertisement -
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ కళాశాల సమస్యలు పరిష్కరించాలంటూ ఆ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ… తరగతి గదిలో కూర్చోవడానికి బెంచీలు కూడా లేవని కనీస సౌకర్యాలైన వాష్ రూమ్స్, తాగునీటి సదుపాయం కూడా లేదని వాపోయారు. రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ప్రిన్సిపల్ ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగి అని, అందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లు అయినా ఇంత పెద్ద కళాశాలకు అటెండర్ కూడా లేకపోవడం చాలా బాధాకరమని విషయమన్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు.
- Advertisement -