Sunday, April 13, 2025

టీచర్ వేధింపులు..కత్తితో చేయి కోసుకున్న విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలు వేధించడంతో ఒక విద్యార్థిని చేయి కోసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న యామిని స్టడీ హవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో ఈనెల 6వ తేదీ రాత్రి మూడు గంటల పాటు నిలబెట్టి తాగునీరు కూడా ముట్టనీయకుండా, బాత్రూంకు వెళ్లనీయకుండా శిక్షించింది. విద్యార్థుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేక కత్తితో చేయి కోసుకుంది. ఇదిలాఉండగా బాధిత విద్యార్థిని ఇతర ఉపాధ్యాయులతో చనువుగా ఉండడాన్ని’

జీర్ణించుకోలేక ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కళ్యాణి కక్షసాధింపు చరలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా తన కూతురిని హింసించి, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ఇబ్బంది పెట్టిన సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తాడూర్ మండలం, యత్మతాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని యామిని తండ్రి ధనుంజయ జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న డిఇఒ రమేష్ మంగళవారం నాగనూల్ కెజిబివి పాఠశాలలో విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News