Friday, December 20, 2024

విద్యార్థి సుమన్ స్ఫూర్తి అభినందనీయం : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యార్థి సుమన్ స్ఫూర్తి అభినందనీయమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శనివారం బోడుప్పల్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సుమన్ 20 మొక్కలను నాటారు. రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ నర్సరీకి కాలినడకన వెళ్లి అక్కడి నుంచి మొక్కలను తెచ్చి నాటారు. ఈ విషయాన్ని ఎంపి సంతోష్ ట్వీట్ చేశారు. సుమన్ స్ఫూర్తికి వందనం. చెట్ల పట్ల ఆయనకున్న ప్రేమకు, నర్సరీకి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, మనందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఈ సీజన్‌లోనే 20 మొక్కలు నాటిన అతను మనందరికీ పచ్చని ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అని సుమన్‌ను ఆయన అభినందించారు.

student 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News