Tuesday, January 21, 2025

యువతితో మాట్లాడాడని… విద్యార్థిని చెట్టుకు కట్టేసి… చొక్కాతో ఉరిబిగించి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించిన యువతితో మాట్లాడాడని సదరు యువకుడిని మరో ముగ్గురు యువకులు విచక్షణ రహితంగా చితక బాదిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మలికిపురంలో ఎఎఫ్‌డిటి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఓ యువతితో మాట్లాడాడు. ఇది గమనించిన మరో యువతి ప్రియుడు సెకండియర్ విద్యార్థిపై పగ పెంచుకున్నాడు. ప్రియుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇంటర్ సెకండియర్ స్టూడింట్‌ను సినిమా హాల్ వెనకకు తీసుకెళ్లారు. నలుగురు కలిసి సదరు విద్యార్థిని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు. మెడకు చొక్కా బిగించి ఊపిరాడకుండా చేసి హింసించారు. తనను వదిలి పెట్టాలని యువకుడు పలుమార్లు బ్రతిమాలాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు, బాధితుడు మైనరేనని సిఐ నరేష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News