Monday, December 23, 2024

జాతీయస్థాయి కరాటేలో కాసిపేట విద్యార్థికి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

కాసిపేటః జాతీయ స్థాయి కరాటే పోటిల్లో పాల్గొన్న కాసిపేట విద్యార్థి రడపాక సాహిత్ బ్లాక్ బెల్టు స్పారింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూర్‌లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో రడపాక సాహిత్ అత్యంత ప్రతిభ చూపి స్వర్ణ పతకం సాధించాడని కరాటే మాస్టర్ రంగు శ్రీనివాస్ తెలిపారు. అలాగే మందమర్రికి చెందిన వంశీకృష్ణ బ్రౌన్ బెల్టు స్పారింగ్‌లో అత్యంత ప్రతిభ చూపి గోల్డు మెడల్ సాధించినట్లు ఆయన తెలిపారు.

ఇటివల హైదరాబాద్‌లో విక్టరి షోటోకాన్ కరాటే అసోసియేషన్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రడపాక సాహిత్ బ్రౌన్ బెల్టు స్పారింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టోర్ని గ్రాండ్ చాంపియన్ అవార్డు సాధించడం జరిగిందని, నేడు బ్లాక్ బెల్టు స్పారింగ్‌లో ప్రతిభ చూపిస్వర్ణ పతకం సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. సాహిత్‌ను పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News