Monday, December 23, 2024

ఇంట్లో తండ్రి శవం..పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: కన్న తండ్రి చనిపోయిన దుఃఖంలో ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హజారైన సంఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. గత వారం రోజులుగా విద్యార్థి రోహిత్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం సాయంత్రం మరణించాడు.

కాగా ఆదివారం తండ్రి అంత్యక్రియలు జరగలేదు. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగానే రోహిత్ పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రయల్లో పాల్గొనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News