Friday, November 1, 2024

ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -
Students Arrived In Telangana From Ukraine
స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులకు ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్రానికి చేర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆదివారం నగరానికి వచ్చిన పలువురు విద్యార్థులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడి) పొలిటికల్ వికాస్‌రాజ్, పలువురు ఉన్నతాధికారులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా వారిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. అలాగే ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించి ఉచితంగా విమానాల్లో దేశానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News