Sunday, December 22, 2024

డిబార్ చేసినందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ పై విద్యార్థుల దాడి..

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల ఆగడాలకు హద్దుహదుపు లేకుండా పోతోంది. పరీక్ష రాస్తుండగా కాపీ కొడుతున్నారని అధికారులు డిబార్ చేయగా ఆ విద్యార్థులు ఏకంగా అధికారులపై దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఇచ్చోడలో కేయు పరీక్షలు రాస్తున్నారు.

అందులో కొంత మంది విద్యార్థులు కాపీంగ్ కి పాల్పడ్డారు. వారిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు డిబార్ చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి బెదిరింపులకు గురిచేసి వారి కారుపై రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News