Thursday, December 12, 2024

ఐడిపిఎల్‌ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు రక్తపు వాంతులు..

- Advertisement -
- Advertisement -

ఐడిపిఎల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఘటన
చడీచప్పుడు కాకుండా ఆస్పత్రికి
తరలించిన యాజమాన్యం
తల్లిదండ్రుల ఆగ్రహం

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: చింతల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉదయం 10 గంటల 30 నిమిషాలు సమయంలో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ బిల్డింగ్ 3 అంతస్తులలో 7, 8వ తరగతి క్లాస్ రూమ్‌లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ రూమ్ పక్కన గల బాత్రూం శుభ్రం చేస్తుండగా యాసిడ్ బాటిల్ కింద పడడంతో ఆ వాసనకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. సుమారు 50 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆందోళనకు చెందిన పాఠశాల యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులకు సైతం సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను చింతల్‌లోని ప్రాణధార హాస్పిటల్‌కు తరలించారు. కొందరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నా కనీసం సమాచారం ఇవ్వకపోగా జరిగిన విషయాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపల్ ఏం కాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సమయం ముగియకముందే పిల్లలను ఇంటికి పంపడంతో కొందరు తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళన చేశారు. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి చిన్నారుల ప్రాణాలను ప్రాణదార ఆసుపత్రి యాజమాన్యం కాపాడింది. యాసిడ్ దుర్వాసనతో రక్తపు వాంతులు చేసుకుంటున్న చిన్నారులను చింతల్‌లోని ప్రాణదార ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ సిబ్బంది వైద్యులు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు తెల్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News