విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్స్ ముట్టిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లో కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల 75 వేలమంది విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉండని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్‌లకు వెల కోట్లఅ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం వందల కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్‌డిఓ, ఎంఆర్‌ఓ కార్యాలయాలు ముట్టడించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన బిసి విద్యార్ధుల కోర్ కమిటీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లమీద వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిదులు విడుదల చేయకపోతే విద్యార్థుల తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. గతంలో స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల చదువు దెబ్బ తింటుందని కాలేజీ యాజమాన్యాలకు నచ్చజెప్పి పునః ప్రారంభ చేసామని ఆయన తెలిపారు. ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిపి నిరవదికంగా బంద్ చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ జోలికొస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కృష్ణయ్య హెచ్చరించారు.