- Advertisement -
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని సాయి చైతన్య హైస్కూల్లో సోమవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, రాజకీయ నాయకులుగా పలు రకాల పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. సిఎంగా జి.సింధూజ,విద్యాశాఖ మంత్రిగా బి.రాంతేజ, కలెక్టర్ ఎ.సాయిశ్రీ, కరస్పాండెంట్ ఎస్: దివ్య, ప్రిన్సిపాల్గా జి.సుదీప్తి వ్యవహరించారు. ఉపాధ్యాయులు,అధికారులు, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ బి.రవీందర్ రెడ్డి, కరస్పాండెంట్ బి.కవిత అభినందించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, వసీమా, సైదులు, అహ్మద్ పాషా, సంపూర్ణ, నవీన్, సాగరిక, లక్ష్మీ, శారద, లావణ్య, నీలా, పూజ, సంతోష, స్వాతి, అనిత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -