Sunday, November 24, 2024

దివ్యాంగ విద్యార్థికి తోటి విద్యార్థుల సాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికా లోని ఆగ్నేయ రీజియన్‌లో గల టెనెసే లోని హైస్కూల్ విద్యార్థులు తమ తోటి విద్యార్థి అంగవైకల్యాన్ని గమనించి కృత్రిమ కుడి చేయిని తయారు చేసి అందించారు. సెర్గియో పపెరాల్టా అనే విద్యార్థికి కుడి చెయ్యి సరిగ్గా లేదు. స్నేహితుడి సహాయం కోసం తయారు చేసిన ఆ కృత్రిమ హస్తం తరువాత పలువురి ప్రశంసలు అందుకుంది. టెనెసే లోని నాషవిల్లె సమీపాన హెండెర్సన్ హైస్కూల్‌లో సెర్గియో అడ్మిట్ అయ్యాడు. తన కుడిచేయి కనబడకుండా ఎప్పుడూ దాచేవాడు. “చిన్నప్పుడు స్కూలుకెళ్లే మొదట్లో అందరూ చెయ్యికేమైందని అడిగే వారు. నేనిలాగే పుట్టానని చెప్పేవాడిని. కిండర్‌గార్టెన్‌లో కూడా ఇదే పరిస్థితి.

హెండెర్సన్ హైస్కూల్‌కు వచ్చినా ఎవరి కంటబడకుండా కుడి చెయ్యి దాచుకునే వాడిని” అని తన అనుభవాన్ని వివరించాడు 15 ఏళ్ల సెర్గియో . హైస్కూల్‌లో ఇంజినీరింగ్ టీచర్ జెఫ్ విల్కిన్స్ ఈ సంగతి తెలుసుకున్నారు. ఫర్వా లేదులే ..క్లాస్‌మేట్స్ సహాయం చేస్తారు …బాధపడకు అని సెర్గియో వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. అన్నదే తడవుగా నాలుగు వారాల్లోనే క్లాస్‌మేట్స్ అంతా కలిసి సెర్గియోకు సరిగ్గా సరిపడే 3 డి ప్రింటెడ్ కృత్రిమ హస్తాన్ని తయారు చేయగలిగారు. ఆ కృత్రిమ హస్తం సెర్గియో జీవితాన్ని మార్చేసింది. సెర్గియో మొదటిసారి కృత్రిమ కుడి చేతిని ఉపయోగించి బంతిని పట్టుకోగలిగాడు.

పూర్తిగా లేని చెయ్యితో తాను పెరిగినా, ఇప్పుడు దాదాపు అన్ని పనులూ ఎలాంటి లోటు లేకుండా చేయగలుగుతున్నానని సెర్గియో కొండంత నిబ్బరంతో చెప్పడం స్ఫూర్తి కలిగిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థుల స్ఫూర్తి ఒక ప్రాజెక్టులో మూర్తీభవించడం విశేషంగా హెండెర్సన్ హైస్కూల్ విద్యార్థి లెస్లీ జరమిలియో ఉదహరించాడు. “మీరు ఇంజినీరింగ్ విద్యార్థులే అయి ఉంటే చిక్కులను సరిజేయడానికి కొత్త ఆలోచనలతో రండి” అని ప్రిన్సిపాల్ బాబ్ కాటర్ పిలుపునిచ్చారు. అనుకున్న సంకల్పాన్ని వాస్తవ రూపానికి తీసుకు వచ్చేందుకు విల్కిన్స్, ఆయన విద్యార్థులు పెద్ద సవాలును ఎదుర్కొన్నారని చెప్పారు.

ఈ ప్రాజెక్టు వల్ల విద్యార్థులు పరస్పరం ఒకరినొకరు కష్టసుఖాలు తెలుసుకుని సహకరించుకునే ఆదర్శమైన భావాలు ప్రోది చేసుకున్నాయని తెలిపారు. “తోటి విద్యార్థులు ఎవరూ నాకు టీచర్ పరిచయం చేసేవరకు తెలీదు. తరువాత నుంచి వారితో మమేకమై నడిచాను. 15 ఏళ్లు చెయ్యి లేకుండా జీవించిన నాడు రెండు మహోపకారాలు తోటివిద్యార్థులు చేశారు. ఒకటి చాలా దయ చూపించడం, రెండు నా జీవితాన్ని మార్చివేసేలా ఇలా చెయ్యి తయారు చేసి ఇవ్వడం . ఈ విధంగా ఎవరు చేస్తారు ? ”అని సెర్గియో ఉద్వేగంతో అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News