Monday, December 23, 2024

ఫీజుల కోసం విద్యార్థులకు వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ప్రైవేటు విద్యాసంస్దలు ఐదారు రోజుల నుంచి ఆఖరి టర్మ్ ఫీజులు చెల్లించని విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్నారు. వార్షిక పరీక్షల ముందు అడిగితే చెల్లించడం లేదని, ఇప్పటి నుంచే ఫీజులు వేట ప్రారంభిస్తే మార్చి నాటికి పూర్తిగా చెల్లిస్తారని భావిస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి త్వరగా కట్టాలి పేర్కొంటున్నారు. కొన్ని స్కూళ్ల ఏకంగా చిన్నారులను తరగతులకు దూరంగా ఉంచుతూ తోటి విద్యార్థుల ముందు హేళనగా చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా క్లాస్ టీచర్లకు టార్గెట్ పెట్టి ఫీజులు సకాలంలో వసూలయ్యేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశిస్తూ చెల్లింపులు లేకుంటే వేతనాలు ఆలస్యంగా ఇస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేధింపులు భరించలేక తప్పనిసరి పరిస్దితుల్లో తల్లిదండ్రులు అప్పులు చేసి పూర్తిగా బకాయిలు చెల్లిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మీస్కూళ్లకు చిన్నారులను పంపించమని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వేధింపులు చేసి సంపాదన ముఠా కట్టుకున్న పాఠశాలలు మూత పడక తప్పదని శాపనార్దాలు పెడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లో ఇంగ్లీషు విద్య ప్రవేశపెట్టి కార్పొరేట్ బడులకు దీటుగా విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయని వచ్చే ఏడాది సంక్షేమ పాఠశాలలకు పిల్లలను పంపిస్తామంటున్నారు. జిల్లాలో 1545 ప్రైవేటు స్కూళ్లుండగా వాటిలో 7.25 లక్షలమంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలామంది ఫీజుల వేధింపులకు నెలవారీ పరీక్షలకు హాజరు కావాలంటే భయపడుతున్నారు.

తోటి విద్యార్ధుల అందరి ముందు ఫీజు చెల్లించలేదని, పక్కకు నిలబెట్టడం, పరీక్షకు ఆలస్యంగా పంపడంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు స్దానికంగా ఉండే మండల విద్యాదికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసి తాము ఏమి చేయలేమని, ప్రభుత్వ బడులు ఉండగా ప్రైవేటుకు ఎందుకు పంపిస్తున్నారని ఎదురు సమాధానం చెప్పి పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సంస్దలకు ముక్కుతాడు వేయాలని విద్యార్దిసంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News