Friday, February 7, 2025

దామరవంచ గురుకులంలో విద్యార్థుల అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, దామెరవంచలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ యూఆర్ బాయ్స్ జూనియర్ కళాశాలలో గురువారం రాత్రి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి వైద్యం చేయించారు. విద్యార్థులు గుగులోతు సాయి, లకావత్ రాము, బానోతు యాకూబ్, బానోతు అనిల్ అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరన్న తెలిపారు. కాగా, ఈ నలుగురు రాత్రిపూట సాంబర్లో గుడాలు వేసుకొని తినడం వల్ల విరోచనాలు, వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా వీరిని శుక్రవారం సాయంత్రం డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న అయోధ్యపురం పిహెచ్‌పి డాక్టర్ యమునకళాశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులందరినీ పరీక్షించి ఈ సంఘటన ఫుడ్ పాయిజన్ వల్ల కాదని, అస్వస్థతకు గురయ్యారే తప్పా అంతకుమించి ఏమీ కాలేదని నలుగురు విద్యార్థులు పూర్తిగా కోలుకుంటారని అన్నారు. స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఒ ఎర్ర వీరస్వామి గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని గురుకులంలో తనిఖీ చేశారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్‌లను విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఫుడ్ పాయిజన్ కాదు.. ప్రిన్సిపాల్ హేమంత్
తమ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాలేదని, నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ యూఆర్ బాయ్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురిచెందొద్దని, ఎప్పటికప్పుడు వైద్యులు చక్కని వైద్యం అందిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News