Saturday, November 23, 2024

తల్లడిల్లుతున్న తల్లిద్రండులు

- Advertisement -
- Advertisement -

Students in distress in Ukraine

ఉక్రెయిన్‌లో అవస్థలు పడుతోన్న విద్యార్థులు n భవిష్యత్తు కోసం పంపితే.. ఇలా జరిగిందేంటని ఆందోళన

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : రష్యా యుద్ధోన్మాథంతో ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పలువురు విద్యార్థుల అక్కడ ఉక్కిరిబిక్కిరి అవడంతో ఇక్కడ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుని ఉజ్వల భవిష్యత్తు కోసం పరాయి దేశం పంపితే.. యుద్ధం పుణ్యమా అని తమ పిల్లలు బంకర్లలోనూ.. అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలోనూ తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడ పరిస్థితిని ఉహించుకుంటూ కుమిలిపోతున్నారు. తినడానికి సరైన తిండి లేక, కేవలం మంచినీళ్లతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడుపుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పొరు గు దేశాల్లో పిల్లలు ఏలా ఉన్నారోనంటూ క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు ౩వేల మంది ఉక్రెయిన్ దేశంలో ఎంబిబిఎస్, ఇతర చదువుల నిమిత్తం వెళ్లారు. కాగా, అక్కడ రష్యాతో జరుగుతోన్న యుద్ధంతో తమ పిల్లలు బిక్కుబిక్కు మం టూ గడుపుతున్నారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తల్లడిల్లిపోతున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సం ఖ్యలో ఎంబిబిఎస్ చదివేందుకు ఉక్రెయిన్‌లోని వివిధ మెడికల్ కళాశాలల్లో జాయిన కాగా, అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు రోజులుగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు వాట్స్‌ప్‌లో మాట్లాడుతూ పరిస్థితిని వివరించడం, అక్కడ యుద్ధం తీరుతెన్నులను తెలుసుకుం టూ వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా మండల కేంద్రం గట్టుకు చెందిన రాహుల్‌ను ఉక్రెయన్‌లోని బుకోవినియన్ స్టేట్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చేసేందుకు వెళ్ళాడు. మే నెలలో చివరి సెమిస్టర్ పూర్తయి ఉంటే ఇండియా వచ్చేందుకు అవకాశం ఉంది. ఈలోగా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఇక్కడ రాహుల్ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, లీలావతి ఆందోళనతో తమ కుమారుడివ రాకకోసం ఎదురుచూస్తున్నారు. మహబూబ్‌నగర్ న్యూటౌన్‌కు చెం దిన ఉద్యోగి సత్యనారాయణ కుమార్తె సాయి స్పందన ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నాలుగు నెలల్లో ఇండియాకు రావాల్సి ఉంది. ఈలోగా పరిస్థితి ఇలా మారడంతో సాయి స్పందన తల్లిదండ్రులు దిగులు చెందుతున్నారు. జిల్లాలోని మఖ్తల్ బసవేశ్వర కాలనీకి చెందిన శివరాం, ప్రియాంకల కుమార్తె అక్షత సూతం ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ చదువుతోంది. యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. భారత్‌కు తిరిగి రప్పించాలని అక్షిత తల్లిదండ్రులు కోరుతున్నారు.

కాగా, సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో జర్నలిస్టు పున్నంరాజు కుమారుడు పున్నం శ్రీశాంత్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు. తమ కుమారుడిని స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్ ని శ్రీశాంత్ తండ్రి రాజు వేడుకున్నాడు.

ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన వైద్య విద్యార్థులు తరగపు మనాలి మెడిసిన్ ద్వితీయ సంవత్సరం, జనగాని విశాల్ కుమార్ ఫైనలియర్ ఉక్రెయిన్‌లో అభ్యసిస్తున్నారు. తమ బిడ్డను క్షేమం గా తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు తినడానికి ఆహారం లేదని తాగడానికి సైతం మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మనాలి ఫోన్ ద్వారా తల్లి కవితకు చెప్పి బోరున విలపించిందని చెపుతున్నారు. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్ చేసినట్లు తమను వేరే ప్రదేశానికి బస్సులో తరలించి అక్కడి నుండి విమా నం ఏర్పాటు చేసి మన దేశానికి తరలిస్తారని తెలిపినట్లు వివరించారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన నర్సింలు, సుజాత దంపతులకు పెద్ద కొడుకు సృజన్ రాజ్ ఉక్రెయిన్‌లో చదువుతున్నాడు. ఇండియాకు వచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, రష్యా దళాలు బాంబ్ బ్లాస్ట్‌తో వెంటనే తిరిగి కాలేజీకి వెళ్లపోయాడు. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కొడుకు సృజన్ మాట్లాడుతూ తల్లీ సుజాత కన్నీరు పెట్టుకుంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ షాపూర్, శంషాబాద్ ఆదర్శ నగర్ కాలనీ నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఆదర్శనగర్‌కు చెందిన నిషా రాణి, షాపూర్‌కు చెందిన శ్రీనిధి ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. ఉక్రెయిన్లోని బంకర్లలో బిక్కుబిక్కుమం టూ ఉన్నామని వీడియో కాల్ ద్వారా చెబుతుంటే ఇక్కడ ఉన్న తల్లిద్రండులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలను ఎలాగైన స్వస్థలాలకు చేర్చాలని ప్రధాని నరేంద్రమోడీని వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ కు చెందిన శ్రీనిధి, నిషా రాణి శంషాబాద్ మూడు సంవత్సరాల క్రితం మెడిసిన్ చదివేందుకు వెళ్ళి ఇప్పుడు అక్కడ చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షింతంగా భారత్ కు తరలించాలని భారత ప్రధాన మంత్రి మోడీ, మంత్రి కెటిఆర్‌ను వేడుకుంటున్నారు. తల్లిదండ్రులను జడ్పీటీసీ తన్వీర్ రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తదితరులు తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సిఎం కెసిఆర్‌తో మాట్లాడి ఎలాగైనా వారిని సురక్షితంగా తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా, వీరిని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్‌రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News