Thursday, January 23, 2025

ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

కొడంగల్: పరిమితికి మించి పాఠశాల విద్యార్ధులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన సోమవారం పట్టణంలోని టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద చోటుచేసుకుంది. ఉదయం పురపాలిక పరిధిలోని బుల్కాపూర్ నుండి 18 మంది విద్యార్ధులతో బాళికల ఉన్నత పాఠశాలకు ఆటో బయలుదేరింది. పరిమితికి మించి ప్రయాణంతో పాటు ఆటో డ్రైవర్ నిర్లక్షం కారణంగా ఆటో బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో మూగ్గురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి మేరుగైన చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొడ ంగల్ ప్రభుతాసుపత్రిలో ఇతర విద్యార్ధులకు ప్రధమ చికిత్సలు అం దించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ జరుపుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యార్ధులకు మేరుగైన వైద్యం అందించాలని వైద్యులను అదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News