Thursday, January 23, 2025

కంప్యూటర్ సైన్స్‌కే జై

- Advertisement -
- Advertisement -

ఇంజినీరింగ్ విద్య వేగవంతంగా మా ర్పు చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఇంజనీరింగ్ వి ద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంజినీరిం గ్ విద్య అంటేనే సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటేనే ఇంజినీరింగ్ అనేలాగా మారిపోయింది. ప్ర పంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు ప్రా ధాన్యత పెరగడం, మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో విద్యార్థులు సిఎస్‌ఇకే మొగ్గు చూపుతున్నా రు. దాంతో సివిల్, మెకానికల్ వంటి బ్రాంచీలలో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు షెడ్యూల్ వె లువడటంతో విద్యార్థులు వారి ఎంసె ట్ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో సీటు లభిస్తుందో అని ప రిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీటే కావాలని ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రు ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగం పొందడం, లేదంటే పోస్టు గ్రాడ్యుయేషన్  చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచీపైనే ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌తో డిజిటలైజేషన్‌లో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్ నియామకాలు భారీగా పెరగడం.. ఇతర విభాగాల్లో ప్రాంగణ నియామకాలు సరిగా లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు సిఎస్‌ఇ సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

ఈ బ్రాంచీలో రాష్ట్రంలో కన్వీనర్ కోటా లేదా మేనేజ్‌మెంట్ కోటాలో సీటు లభించకపోతే తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో వెళ్లి ప్రైవేట్ యూనివర్సిటీలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులు, విద్యార్థి తెలివితేటలతో సంబంధం లేకుండా సిఎస్‌ఇ కోసమే అందరూ పోటీ పడుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటన విడుదల కాకపోయినా అనధికారికంగా ఒప్పందాలు జరిగిపోతున్నాయి.
మిగతా సీట్లు సగానికన్నా తక్కువే
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది కన్వీనర్ కోటా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల సీట్లు మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. మొత్తం సీట్లలో సిఎస్‌ఇ 45 వేలకుపైగా సీట్లు ఉండగా, మిగతా అన్ని బ్రాంచీలు కలిపి 35 వేల వరకు సీట్లు ఉన్నాయి. గతేడాది సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్లో 4,615, ఇసిఇలో 12,219,ఇఇఇ 5,778 సీట్లు ఉండగా, కేవలం ఒక కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలోనే 45 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి కూడా సీట్ల సంఖ్యలో అంతగా మార్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
సిఎస్‌ఇ అనుబంధ కోర్సులకు మొగ్గు
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో గతేడాది కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు మొగ్గు చూపారు. గతేడాది కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు పొందగా,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.76 శాతం,సిఎస్‌ఇ(డాటా సైన్స్)లో 99.64 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు లభించాయి. గతేడాది సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు.

ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లు పొందగా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి.గతేడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాటిక్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ ఇంజనీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ సిస్టమ్స్, బయో టెక్నాలజి బ్రాంచీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

-ఏ కోటా అయినా టాప్‌టెన్ కళాశాలల్లో చేరేందుకే ఆసక్తి
ఇంజనీరింగ్‌లో బ్రాంచీ ఎంపికతో పాటు కాలేజీ ఎంపికకు విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. యాజమాన్య కోటా, కన్వీనర్ కోటాలోనూ సిఎస్‌ఇ, దాని అనుబంధ బ్రాంచీల సీట్ల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కోరుకున్న కళాశాలలో కోరుకున్న కోర్సులో సీటు లభిస్తుంది. ర్యాంకు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు కోరుకున్న కళాశాలగానీ లేదా కోరుకున్న కోర్సుగానీ ఏదో ఒకటే లభిస్తుంది. కన్వీనర్ కోటా కింద సీటు రాని అభ్యర్థులు యాజమాన్య కోటాలో అయినా టాప్ 10 కళాశాలల్లో చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
రెండు కోటాలకు డిమాండ్
రా్రష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కళాశాలల 10 నుంచి 15 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలలో సిఎస్‌ఇ, దాని అనుబంధ బ్రాంచీల సీట్లకు కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాకు డిమాండ్ ఉంది. విద్యార్థులు కళాశాల కంటే కూడా కోర్సుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము కోరుకున్న కళాశాలలో తాము కోరుకున్న బ్రాంచీలో సీటు పొందడానికే విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, కళాశాలల విషయంలో కొంత రాజీపడుతున్నట్లు తెలుస్తోంది. తమ ర్యాంకును బట్టి కన్వీనర్ కోటాలో తాము కోరుకున్న కోర్సులో సీటు రాదను భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటాలో అయినా టాప్ కళాశాలలో సీటు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాజమాన్య కోటా సీట్లలో కూడా సిఎస్‌ఇ, అనుబంధ కోర్సుల బ్రాంచీలకే డిమాండ్ ఉన్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు.
ట్రెండ్‌పై అవగాహన లేకపోవడమూ కారణమే..
సాఫ్ట్‌వేర్, ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తిస్థాయిలో మారింది. ఇంజినీరింగ్‌లో సిఎస్‌ఇ చదవాలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు బ్రాంచిల కంటే విద్యార్థి నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచిల్లో సివిల్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చదువుతున్న వారు పైథాన్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్, జావా,సర్టిఫికేషన్ కోర్సులు లాంటివి నేర్చుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందుతున్నారు.

సాఫ్ట్‌వేర్ రంగంలో కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకే అవకాశాలు లభిస్తాయనేది వాస్తవం కాదని, సివిల్, మెకానికల్ వంటి కోర్ బ్రాంచీల విద్యార్థులు అవసరమైన టెక్నాలజీ నేర్చుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. సివిల్, మెకానికల్ వంటి కోర్ బ్రాంచీల విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందగలుగుతారు కానీ, కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులు సివిల్, మెకానికల్ రంగాలలో ఉపాధి పొందలేరని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ చదివితేనే అవకాశాలు లభిస్తాయన్న ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. సివిల్,మెకానికల్ వంటి బ్రాంచీలు ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయని, ఈ బ్రాంచీలు చదివిన విద్యార్థులకు ఎప్పటికీ అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News