- Advertisement -
హైదరాబాద్: అశోక్ నగర్ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్ ఉంటున్న విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగానికి సన్నధమవుతుంది. మృతురాలు వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక గా గుర్తించారు. పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న విద్యార్థులు వేలాదిగా హాస్టల్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేదే లేదంటు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో అశోక్ నగర్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
- Advertisement -