Sunday, January 19, 2025

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సూర్యాపేట విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: బీహార్ రాజదాని పాట్నాలో లో జరుగనున్న జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల లోపాల్గొనడానికి వెళుతున్న సూర్యాపేట జిల్లా జట్టుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు. క్రీడా దుస్తులను పంపిణీ చేసిన మంత్రి ముందస్తు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు 15 మంది విద్యార్థినీ, విద్యార్దులకు ప్రయాణ ఖర్చులు అందజేసి, క్రీడలు, క్రీడాకారుల పట్ల తనకు ఉన్న మక్కువ ను మంత్రి తెలియజేశారు. అథ్లెటిక్స్ లో మంచి నైపుణ్యం ప్రదర్శించి సూర్యాపేట జిల్లాకు తమ గ్రామాలకు, తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని ఈ సందర్బంగా మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News