Monday, December 23, 2024

అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో గిరిజన గురుకుల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గిరిజన గురుకుల విద్యా సంస్థలకు చెందిన నలుగురు విద్యార్థులు అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో పనిచేయడానికి ఎంపికయ్యారు. వీరు భారత సైన్యానికి సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఎంపికైన విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. అశోక్‌నగర్ సైనిక్ స్కూల్‌కి చెందిన మాలోత్ జావేందర్, బానోథ్ రాము, వెల్పుల అజయ్ (బిఎస్‌సి), ఇన్స్లావత్ నరేష్ (ఇంటర్ సెకండ్ ఇయర్) లు సైన్యంలో ఎంపిక కోసం నిర్వహించిన వరుస పరీక్షల్లో ఎంపియ్యారు. సైన్యంలో పనిచేయడానికి ఎంపికవ్వడం పట్ల నలుగురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. గురుకులం సహకారంతోనే ఇది సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.

కాగా త్రివిధ దళాల్లో మమేకమై దేశానికి సేవ చేయాలని భావిస్తున్న గిరిజన విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అగ్నిపథ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించడంతో పాటు మరింత క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దబడుతారని అన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థులు సైనికులుగా భారత దేశానికి సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.

సాయుధ బాలగాల్లో చేరి దేశానికి సేవ చేయాలనే లక్షంతో ప్రతి విద్యార్థి ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాక్షించారు. గిరిజన గురుకులం తమ విద్యార్థులకు ఎన్‌సిసి, పురుషుల కోసం సంగారెడ్డిలోని లా కళాశాల, సిరిసిల్లలోని మహిళలకు లలిత కళా అకాడమి వంటి అనేక అవకశాలు అందిస్తోందని సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు అన్ని రంగాలలో ప్రత్సోహిస్తున్నామన్నారు. ఈ కళాశాలల్లో ప్రవేశాలు టిజియుజిసెట్ ద్వారా నిర్వహిస్తామని ఇందుకోసం దరఖాస్తు చేసుకోడానికి ఫిబ్రవరి 5 చివరితేది అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News