- Advertisement -
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ సాగర్ యూనివర్శిటీ తరగతి గదిలో హిజాబ్‌తో ముస్లిం విద్యార్థి నమాజ్ చేయడం వీడియోలో వైరల్ కావడం వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ జాగరణ్ మంచ్ అనే హిందుత్వ అనుకూలవర్గం యూనివర్శిటీ అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈమేరకు కమిటీ ఏర్పాటైంది. విద్యార్థులు తమ మతపరమైన ఆరాధనలు ఇంటివద్దనే చేసుకోవాలి తప్ప తరగతి గదుల్లో కూడదని, యూనివర్శిటీ అంటే చదువుకోసమే అని వైస్ ఛాన్సలర్ నీలిమా గుప్తా హితవు పలికారు. ఐదుగురు సభ్యులతోకూడిన కమిటీ మూడు రోజుల్లో నివేదిక సమర్పించాక చర్య తీసుకుంటారు.
- Advertisement -