Tuesday, January 21, 2025

విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్ కలకలం

- Advertisement -
- Advertisement -

విద్యార్థి సంఘాల ఆందోళన
ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్, ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
అంగతకుల కోసం రెండు ప్రత్యేక బృందాలు : ఎసిపి నరేష్ రెడ్డి

మన తెలంగాణ/ఘట్‌కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ పరిధిలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థినుల ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వాట్సాప్ డిపి ఫోటోలను మార్ఫింగ్‌చేసి బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై చర్యలు కోరుతూ కళాశాలల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. ఈ విషయమై కళాశాల యాజమాన్యం పెద్దగా స్పందించలేదని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులపై కళాశాల యాజమన్యానికి ఫిర్యాదుచేసిన సరిగా పట్టించుకోవడంలేదంటూ కళాశాల విద్యార్థులతో పాటు ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు కళాశాల ముందు ధర్నా చే శారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుండగులు కొందరు కళాశాల వసతిగృహంలో ఉంటు న్న విద్యార్థినుల ఫోన్ నంబర్లు సేకరించిన అన్‌నౌన్ నెం బర్ల ద్వారా వాట్సప్ డిపిలో ఫోటోలు మార్ఫింగ్ చేసి వి ద్యార్థినులకు షేర్ చేస్తూ వారం రోజులుగా బెదిరింపుల కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫోటోలు మా ర్ఫిం గ్ చేసి విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పలువురు హాస్టల్ విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫి ర్యాదు చేసినా పట్టించుకోక పోవడంపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ నాయక్ తీవ్రస్థాయి లో మండిపడ్డారు.

విజ్ఞాన భారతి కళాశాల సంఘటనపై ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ విలేకర్లతో మాట్లాడుతూ ఇలాంటి పరిణామాలు సమాజానికి ప్రమాదకరమని, విద్యార్థినులకు భరోసా ఇవ్వాల్సిన కళాశాల యాజమాన్యం నిర్లక్షంపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థినుల ఫో టోలు మార్ఫింగ్‌చేసి బెదిరింపులకు పాల్పడిన నిందితుల ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, వి ద్యార్థులకు మద్దతుగా ధర్నాలో కూర్చున విద్యార్థులను సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బలగాలు చెదరగొట్టారు. దీంతో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట లు జరిగాయి. అనంతరం ఎన్‌ఎస్‌యుఐ నాయకులు శివాజీ నాయక్, వినయ్, సాయిచరణ్ రెడ్డిలతోపాటు మరికొంత మంది విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసు వ్యానులో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం : ఎసిపి నరేష్ రెడ్డి

హాస్టల్ వార్డెన్ హేమంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు విద్యార్థినులకు వచ్చిన అన్ నౌన్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆగంతకుల కోసం రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని ఎసిపి నరేష్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, షీ టీం బృందం హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఒక విద్యార్థిని మాత్రమే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News