Wednesday, January 22, 2025

ఆరు బయటే ఆడుకొని ఇండ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః పేద విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే పాఠశాలకు ఎగ నామం పెడుతుందని కొత్తగడపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాసిపేట మండలం మద్దిమాడ సమీపంలో కొత్త గడపూర్ గ్రామం ఉన్నప్పటికి ఇది మంచిర్యాల మండల పరిధిలోకి వస్తుంది. నాలుగు రోజులుగా పాఠశాలకు ఉపాధ్యాయురాలు రావడం లేదని గ్రామస్తుడు సోయం రమేష్ ఆరోపించారు. గ్రామం దూర ప్రాంతంలో ఉండడంతో సంబంధిత అధికారుల పర్య వేక్షణ లేక పోవడంతో ఉపాధ్యాయురాలు తరుచు పాఠశాలకు గైర్హజర్ అవుతుందని ఆయన తెలిపారు.

ఉపాధ్యాయురాలు పాఠశాలకు రాక పోవడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఆరు బయటే ఆడుకొని ఇండ్లకు తిరిగి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి వేలాది రుపాయలు వేతనం తీసుకుంటున్నప్పటికి విద్యార్థులకు మాత్రం విద్య బుద్దులు నేర్పడం లేదని దీంతో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలకు విద్య అందడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయురాలు నిత్యం ఉండేలా చూడాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News