Friday, January 17, 2025

 విద్యార్థులకు పురుగుల అన్నం..

- Advertisement -
- Advertisement -

నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబివి విద్యార్థిలకు గత రెండు రోజులుగా తాము తినే అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, వంట సిబ్బందికి చెప్పిన పట్టించుకొవడంలేదని, విద్యార్థులు పాఠశాల భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. మూడు రోజులుగా పురుగుల అన్నం తినడంతో పలువురికి కడుపు నొప్పి,వాంతులు అవుతున్న సిబ్బంది పట్టించుకొవడం లేదని ఆదివారం విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యను ఎస్వోగారికి పోన్‌ద్వారా సమాచారం అందించి సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకొవాని కొరగా తాను అందుబాటులో లేనని సోమవారం విచారించి సిబ్బందిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో విద్యార్థులను సముదాయించి ఆందొళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News