Thursday, January 23, 2025

హాస్టల్లో మౌలిక వనతుల కోసం విద్యార్థినుల రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

గోషామహల్: నిజాం కళాశాలలో పిజి ప్రధమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు సైఫాబాద్, హాస్టల్లో అరకొర వనతులు కల్పించి, సక్రమంగా భోజనం, అల్ఫాహారం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆగ్రహంతో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట, బషీర్ బాగ్, రోడ్డుపై బైఠాయించి రాస్తారాకో చేపట్టారు. దీంతో ఒక గంట సేవు ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అనేకమంది విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు పెద్దఎత్తున ని నాదాలు చేయడంతో పోలీసులు విద్యార్థినీలను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. అంతకు ముందు విద్యార్థినులు ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట గంటన్నర సేవు ఆందోళన నిర్వహించినా, ప్రిన్సిపల్ వట్టించుకోకపోవడంతో విద్యార్థినీలు రోడ్డేక్కి రాస్తారా కో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీలు మాట్లాడుతూ సైఫాబాద్ హాస్టల్ లోని రెండు రూంల్లో 70 మంది ఉంటున్నారని, కనీస మౌలిక వనతులు లేవని, మంచినీరు సరపరా సక్రమంగా లేదని, బాత్రూంలు దారుణంగా ఉన్నాయని, వంట సిబ్బంది లేక టిఫెన్స్, భోజనం తామే చేనుకుని కళాశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. ఉదయం చేసుకున్న టిఫెన్స్ ను మధ్యాహ్నం లంచ్‌కు, రాత్రి భోజనానికి వాడుకోవల్సి వస్తుందని కన్నీటి వర్యంతమైనారు. ఈ విషయాలపై గత 20 రోజులుగా ప్రిన్సిపల్ కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం పో లీసు అధికారులు విద్యార్థినులు, ప్రిన్సిపల్‌తో నమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థినులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News