Sunday, December 22, 2024

ప్రిన్సిపల్ మాకొద్దంటూ విద్యార్థుల ధర్నా

- Advertisement -
- Advertisement -

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే మార్చాలంటూ.. ఆ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ విద్యార్థినులు శనివారం పాఠశాల గేట్ ముందు ఆందోళనకు దిగారు. అందోల్‌లోని గురుకుల పాఠశాల ముందు విద్యార్థినులు ప్రిన్సిపల్‌ను తొలగించాలంటూ సుమారు రెండు గంటలపాటు ఆందోళనకు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ పాండు సిఐ అనిల్‌కుమార్‌లు అక్కడికి చేరుకొని ఎంత నచ్చచెప్పినా విద్యార్థులు వినిపించుకొలేదు, ప్రిన్సిపల్‌ను ఇక్కడి నుంచి తొలగిస్తేనే పాఠశాల లోపలికి వస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. తమతో వెట్టిచాకిరి చేపిస్తున్నట్లు వారు ఆరోపించారు.

ఆమే గదిని శుభ్రం చేయడం, అంట్లు శుభ్రం చేయడం, ఉడవటం, నీటిని తెచ్చిపెట్డడంతోపాటు ప్రిన్సిపల్ కారును రోజు శుభ్రం చేయలని వారు అధికారులకు వివరించారు. ఎప్పడు మమ్మల్ని దూషిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులపై కక్షసాధింపులకు చర్యలు దిగుతున్నట్లు వారు చెప్పారు. ఇటీవల ఫీజికల్ డైరెక్టర్‌ను అకారణంగా తొలగించినట్లు వారు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సద్దుణమేరిగ్రేసి ఉంటే చదువుకోమంటూ వారు మొండి కేశారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాఠశాలకు వస్తున్నట్లు ఆర్డీఓ విద్యార్థులకు చెప్పడంతో పాఠశాల లోపలికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News