Friday, January 17, 2025

బాసరలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు ఫీజు బకాయిలు, పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్స్ చేల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు గాలిలో దీపంలా మారాయని విద్యార్థి సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇసిఐఎల్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ మహా ర్యాలీలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పాల్గొని నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల 75 వేల మంది విద్యార్ధుల ఫీజులు చెల్లించాల్సి ఉందని అన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు వేలకోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం వందల కోట్లు ఉన్న – విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

మూడు సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి స్కాలర్ షిప్ లకు కూడా నిధుల్విలేదని విమర్శించారు. గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లమీద వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉంది. కానీ విద్యార్థులంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. గతంలో స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ బంద్ చేస్తే విద్యార్థుల చదువు దెబ్బ తింటుందని కాలేజీ యాజమాన్యాలకు నచ్చజెప్పి పునః ప్రారంభ చేసామని, కాని ప్రభుత్వానికి బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిపి నిరవదికంగా బంద్ చేస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో గత 11 నెలల కాలంలో ప్రభుత్వం తెచ్చిన అప్పులు 80 వేల కోట్లైతే ఆదాయం లక్ష కోట్లని, ఇందులో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? ఇతర బిల్లులు ఎన్ని చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు రూ. 4వేల కోట్లు తక్షణమే చెల్లించాలని కోరారు. కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్పులు సంవత్సరానికి రూ. 5500 చెల్లిస్తే అవి ఎక్కడ సరిపోతాయని కృష్ణయ్య ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి రూ. 20వేలు, కర్ణాటక రాష్ట్రంలో 15వేలు స్కాలర్‌షిప్ ఇస్తున్నారని తెలిపారు. అందుకే డిగ్రీలు చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్ 20 వేలకు పెంచాలని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News