Saturday, November 9, 2024

బెంగాల్ లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్’ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరిట విద్యార్థులు హవ్ డా నుంచి ర్యాలీ నిర్వహించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో సంతర్ గాచి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఆందోళనకారులు బారికేడ్లను లాగి పడేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. ఉద్రిక్తత తీవ్రంగా ఉండడంతో మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతను పెంచారు. పోలీసులు నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. విశేషమేమిటంటే ఆ విద్యార్థులు అర్ధరాత్రి నుంచే కనిపించడంలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News