Friday, January 17, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో ఆగని నిరసనలు

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ రెండో రోజు విద్యార్థులు నిరసనకు దిగారు. విసి వెంకటరమణ రాజీనామా చేయాలని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. బుధవారం సాయంత్రం అప్పటికప్పుడే ఆందోళన నిరసన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన పంథా వీడేది లేదని స్పష్టం చేసుకున్నారు. గురువారం సాయంత్రం వేళ నిరసనకు దిగిన విద్యార్థులు ప్రధాన గేటు దాకా తరలివచ్చారు. బయటకు వచ్చి రోడ్డుపై ఆందోళన చేసే పరిస్థితులు ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులు బయటకు రాకుండా ప్రధాన గేటునుమూసివేశారు.

17 డిమాండ్లతో మళ్లీ ర్యాలీ నిర్వహించారు. నిరసన చేపట్టిన తాము తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు దిగి ఆందోళన ఉధృతం చేస్తామని టిఎస్‌ఏఎస్ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యార్థులు కోరుతున్న డిమాండ్ల పరిష్కారం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల ప్రధాన డిమాండు ఇంచార్జీ వీసి రాజీనామా, మెస్ కాంట్రాక్టర్ల తొలగింపు కోసం ఆందోళన బాట పడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని పరిస్థితులు ఇలాగే ఉంటే గతంలో మాదిరి మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News