- సమస్య పరిష్కరిస్తామని పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి హామీ
కాటారం: మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని, హాస్టల్ అరకొర సౌకర్యాలు ఉన్నాయని దామెరకుంట గిరిజన ఆశ్రమ పాఠశాలు విద్యార్థులు హాస్టల్ ముందు ధర్నా నిర్వహించి రోడ్డుపై భైఠాయించారు. గత కొన్ని రోజులుగా మంచినీళ్లు రావడంలేదని, వర్షాల కారణంగా మురికి నీరు వస్తుందని, ఉపాధ్యాయులు సరిగ్గా చదువు భోధించడంలేదని అనేక సార్లు ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని అనేక సార్లు ప్రిన్సిపాల్‌కు తెలియజేయడం జరిగిందని, ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురి విద్యార్థులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దామెరకుంటవిలాసాగర్ మధ్యలో హాస్టల్ ముందు రోడ్డుపై విద్యార్థులు భైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు సమాచరం ఇవ్వడంతో కాటారం ఎస్సై పోలీస్ సిబ్బందితో స్థలానికి చేరుకున్నారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానని విద్యార్థులతో ఎస్సై తెలిపారు.
సమస్య పరిష్కరిస్తానని చల్లా నారాయణరెడ్డి హామీ
దామెరకుంట ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సమస్యలు ఉన్నాయంటూ రోడ్డుపై భైఠాయించి ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి ఆగి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు మౌళిక వసతులు లేవని, ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్‌తో మాట్లాడి విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్ భవేష్‌మిశ్రాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్.సి.ఒ, డి.సీ.ఓతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు నచ్చజెప్పి వారిని క్లాస్ రూములకు పంపించారు.