Monday, December 23, 2024

జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

బీబీపేట్ : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధన సమితి ఆధ్వర్యంలో మండల కేంద్ర ంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు కళాశాల ఏర్పాటు చేసి శ్రీమంతుడు సినిమా హీరో మహేష్ బాబు చే ప్రారంభోత్సవం చేస్తారని ఈ సందర్భంగా విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమయ్యే విదంగా మంత్రులు, అధికారులు చొరవ తీసుకుని కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు జూనియర్ కళాశాల సాధన సమితి వెంకట్రాం రెడ్డి, సర్పంచ్ పాతరాజు, వంశీ, దేవరాజ్, సంతోష్ గౌడ్, శివ, స్వామి, కురల వెంకటేశం, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News