Monday, January 20, 2025

బ్యాడ్మింటన్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉప్పుగల్లు విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండలంలోని ఉప్పుగల్లు ఉన్నత పాఠశాలకు చెందిన పులి కార్తికేయ, ఇదే గ్రామానికి చెందిన కోరుకొప్పుల గుణాతేజ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి కిషన్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదెపాక అయోధ్య బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 11,12 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.

వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదెపాక అయోధ్యతో పాటు పిఈటీ దిలీప్ కుమార్, ఉపాధ్యాయులు వెంకటపతి, రంజిత్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, మనోహరస్వామి, రాజు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News