Thursday, January 23, 2025

టీచర్‌పై విద్యార్థుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

లక్నో: టీచర్‌పై ఇద్దరు మైనర్ విద్యార్థులు తుపాకీతో కాల్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుమిత్ అనే వ్యక్తి విద్యార్థులకు కోచింగ్ క్లాసులు చెబుతుండేవాడు. మాలుపూర్ గ్రామానికి చెందిన సుమిత్ సోదరుడితో విద్యార్థులు గొడవ పడ్డారు. సుమిత్ క్లాసులు చెబుతుండగా ఇద్దరు విద్యార్థులు బయటకు రమ్మని పిలిచారు. సుమిత్ బయటకు రాగానే అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పటి వరకు ఒక బుల్లెట్ మాత్రమే టీచర్ శరీరంలోకి దించామని, ఇంకా 29 బుల్లెట్స్ దించుతామని వీడియో రికార్డు చేసి టీచర్‌కు పోస్టు చేశారు. బుల్లెట్ ఎడమ కాలులో దిగడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: బంగ్లాపై గెలుపు…. ఫైనల్‌కు చేరిన భారత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News