Wednesday, January 22, 2025

వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

- Advertisement -
- Advertisement -

అన్నదాతల ఆత్మీయ సత్కారంలో మాజీ సిబిఐ జెడి లక్ష్మినారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కాలంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది రైతులేనని అన్ని రంగాలు వెనక్కి వెళుతుంటే ముందుకు వెళ్లింది వ్యవసాయ రంగం మాత్రమేనని మాజీ సిబిఐ జెడి లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రపంచంలో 70 దేశాలకు ఆహారధాన్యాలను సరఫరా చేసే సత్తా ఉందని చెప్పాడంటే దానికి కారణం తెలంగాణ రైతులేనని అంకితభావంతో పనిచేస్తున్న మీ అందరినీ సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఆదివారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వహించిన అన్నదాతల ఆత్మీయ సత్కారం సభకు హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులకు వ్యవసాయం గురించి తెలిజేయాలని రైతు సంఘాల ప్రాముఖ్యత గురించి, పాలకేంద్రం, సంఘాల గురించి, మేకల పెంపకం, వ్యవసాయాన్ని ఏలా లాభసాటిగా ఉందో వివరించారు.

మహాత్మాగాంధీ మేక పాలు, పల్లీలు తినేవారని ప్రస్తుత సమాజంలో కాలేజీ విద్యార్థులను, పాఠశాల విద్యార్థులకు పంట పోలాల్లోకి తీసుకెళ్లి వ్యవసాయంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయంలో యువతరం ఎలా రావాలి, వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చాలి అని మనందరం ఆలోచించాలన్నారు. ఈసందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్రకు ఒక టార్గెట్ ఇస్తున్నట్లు ఇక్కడికి వచ్చిన రైతులందరి దగ్గర నుంచి మీరు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఐతే ఏం చేస్తారనే దానిపై ఒక నాలుగైదు పాయింట్లు రాసి పంపండి వాటి అన్నింటిని సంకలనం చేసి ఒక రిపోర్టు ముఖ్యమంత్రికి ఇచ్చి రైతు బాధ తెలియజేద్దామన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి అధ్యక్షత వహించగా గౌరవ అతిథులుగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు, డా. జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటి మాజీ విసీ ప్రవీణ్ రావు, రిటైర్డ్ అగ్రికల్చర్ కమిషనర్ అశోక్ కుమార్ హాజరై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జి. జయరాం, కొమటి రమేశ్ బాబు, మూడావత్ రమేశ్. మారియా అంతోని, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, లక్ష్మికళ, గీత, రాజు కానుగంటి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News