Monday, December 23, 2024

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -
  • సర్పంచ్ శ్రావణ్ కుమార్

పెద్దేముల్: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సర్పంచ్ శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా మన ఊరుమన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి.. పాఠశాలల రూపురేఖలను మార్చుతుందని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలలో అందుబాటులోకి తీసుకువచ్చిన లైబ్రరీలో పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతర పఠనంతో ఉత్తమ ప్రతిభను సాధించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ యేసు, ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు చంద్రయ్య, ఊర్మిల, బాలమణి, శిక్షణ ఫౌండేషన్ మెంటర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News