Monday, December 23, 2024

విద్యార్థినీలు చదువుతోపాటు ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందాలి

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : విద్యార్థినీలు చదువుతోపాటు అభిరుచులకు అనుగుణంగా ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ పి.లక్ష్మినారాయణ అన్నారు. రాజాబహదూర్ వెంకట రామారెడ్డి మహిళా కళాశాల 12వ స్నాతకో త్సవ వేడుకలు శుక్రవారం నారాయణగూడలోని కళాశాల ఆడిటోరియంలో ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమానికి లక్ష్మినారాయణ ముఖ్యఅతి థిగా పాల్గొని మా ట్లాడుతూ స్త్రీలు, పురుషులతో సమాన ంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు ఆనందంగా ఉంటూనే ఉ న్నత లక్షాలను సాధించాలని సూ చించారు. తమ లక్ష్యాలను సాధించిన వారు ఇలాంటి వేడుకలను వచ్చి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకా ంక్షించారు. వి విధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 938మంది విద్యార్థినీలకు డిగ్రీ పట్టా లు, స్వర్ణ పథకాలను అందించారు. కార్యక్రమంలో ఓయూ కంట్రోల ర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏం.రాములు, మహిళా కళాశాల కార్యదర్శి ప్రొ.జి.సుదర్శన్‌రెడ్డి, డా. వసుంధర, ప్రి న్సిపాల్ డా.జె.అచ్యుతాదేవి, కె. స్వప్న, డా.కవిత, డా.సుచిత్ర, బిందు, పావని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News