Monday, January 20, 2025

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

- Advertisement -
- Advertisement -

లింగాల : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి చంద్రుడు అన్నారు. శుక్రవారం లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఉంటుందని, క్రీడల వల్లే మేదస్సు పెరుగుతుందని అన్నారు.

అదే విధంగా ఆటలో రానిస్తే ఆరోగ్యంతో పాటు మేదస్సు వస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో అండర్ 14, 16 విభాగాల్లో విద్యార్థులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ హనుమంతు నాయక్, ఎస్‌జిఎఫ్ జిల్లా కార్యదర్శి పాండు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, పీడిలు వెంకటేశ్వర్లు, స్వరూప, పద్మ, పిఈటి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News