Monday, December 23, 2024

మహాత్మా జ్యోతిబా ఫూలే విధానాలు విద్యార్థులు ఆచరించాలి: ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే ఆచరించి ప్రచారం చేసిన సత్య, ధర్మ తత్వశాస్త్రాన్ని విద్యార్ధులు పాటించాలని కురుక్షేత్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్ పేర్కొన్నారు.  ‘మహాత్మా జ్యోతిబా పూలే దృక్పథం – సమకాలీన ఆవశ్యకత’ అనే అంశంపై ఓయూలోని జ్యోతిబా ఫూలే పరిశోధనా కేంద్రంలో శుక్రవారం రెండు రోజుల జాతీయ సదస్సు విసి రవీందర్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీపై ఫూలే ప్రభావం ఉందని సత్య ధర్మం తత్వశాస్త్రం, సత్యం, న్యాయం, సమానత్వం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల అతని అచంచలమైన నిబద్ధత భారతదేశ సామాజిక, మేధో చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిపిందన్నారు.

అదే విధంగా ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ప్రసంగిస్తూ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చారిత్రక సందర్భాల ఉన్నాయని, జ్యోతిబా ఫూలే లాంటి మహనీయులతో నేటి సమాజంలో వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అనుభవిస్తున్నామన్నారు. నేటికీ ఓబిసి పేరుతో వెనకబడిన వర్గాలుగా పేర్కొనటం… మానసికంగా వెనకబడిన వారిగా ముద్ర వేయటమేనని వెల్లడించారు. ఊహించలేని భవిష్యత్తు వైపు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సామాజిక శాస్త్రవేత్తల పాత్ర ఎనలేనిదని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్ ,ప్రొఫెర్లు నగేష్, రాములు, సిహెచ్. శ్రీనివాస్,సాయిలు, నర్శిములు, ప్రిన్సిపాల్స్, డీన్స్‌లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News