Wednesday, January 22, 2025

ఆర్టీసీ బస్ పాసులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -
- Advertisement -
  • కుషాయిగూడ డిపో మేనేజర్ చంద్రకాంత్

కీసర: ఆర్టీసీ అందిస్తున్న బస్ పాసులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కుషాయిగూడ డిపో మేనేజర్ చంద్రకాంత్ అన్నారు. సోమవారం కీసర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్ధునులకు కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ ఆర్ధిక సహకారంతో రాయితీ బస్ పాసులు అందజేశారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 12 ఏళ్ల లోపు బాలురకు, పదో తరగతి వరకు బాలికలకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 20 కిలో మీటర్ల వరకు ఉచిత బస్ పాసులు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధుల బస్ పాసులకు సంబంధించి కనీస రుసుము చెల్లించిన సర్పంచ్ మాధురి వెంకటేష్‌ను మేనేజర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్‌శర్మ, ఆర్టీసీ విలేజ్ ఆఫీసర్ చినింగని ఆనంద్‌రావు, పాఠశాల సహాయ ప్రధానోపాధ్యాయులు వేదవతి, ఆర్టీసీ సిబ్బంది శ్రీశైలం, వెంకటేష్, రాజు యాదవ్, శ్రావణ్ గౌడ్, హరీష్, సాయి, రాఘవేందర్, కెఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News