Friday, December 20, 2024

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డి

హత్నూర: విద్యార్థులు గట్టి పట్టుదల, ఏకాగ్రతతో చదవాలని ఎమ్మెల్యే చిలుముల మధన్ రెడ్డి సూచించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని సిరిపుర గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఏక రూప దుస్తులను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంసృతిక నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా బోధనకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

కార్యక్రమంలో జడ్పిటిసి ఆంజనేయులు, ఎంపిపి నర్సింలు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి సత్యం, సర్పంచి విజయలక్ష్మి నరేందర్,ఉప సర్పంచ్ వసంత, ఎస్‌ఎంసి చైర్మన్ కృష్ణ, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పండుగ రవి, రైతు సమితి కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, హత్నూర పిఎసిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపిటిసి విట్టల్ రెడ్డి, యువజన మండల అధ్యక్షుడు తుమ్మలపల్లి కిషోర్, దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షులు అజ్మత్ అలీ, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News