Sunday, December 22, 2024

విద్యార్థులు స్వతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఓయూ విసి రవీందర్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: స్వతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు బాధ్యాతాయుత పౌరులుగా మసలుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ, ఓఎస్డీ ఆచార్య బి. రెడ్యానాయక్‌తో కలిసి ఆర్ట్ కళాశాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాల ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తించాలని అన్నారు. అహర్నిశలు కృషి చేసి ప్రంపంచంలోనే బృహత్తరమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించారని, రాజ్యాంగస్పూర్తితో హక్కులతో పాటు బాధ్యతలను పాటించాలని గుర్తు చేశారు.

ఓయూ వారసత్వ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన వందేళ్లలో సాధించిన ప్రగతిని గుర్తు చేసి ఓయూకు భూదానం చేసిన మహలఖాభాయి చందా ఉదారతను స్మరించుకున్నారు. ఆమె పేరుమీదే మహిళా అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం 21 పాయింట్ల అజెండాతో ఓయూ పాలనా పగ్గాలు చేపట్టి విజయవంతంగా అజెండాను అమలు చేశామని స్పష్టం చేశారు. వరుసగా మూడేళ్ల పాటు స్నాతకోత్సవాన్ని నిర్వహించటం, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ లకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేయటం, ఉస్మానియా పౌండేషన్ డే నిర్వహణ, ఉస్మానియా తక్ష్ సహా 300 కోట్ల రూపాయల వ్యయంతో మౌళిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టిన విషయాన్ని వివరించారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వైస్-ఛాన్సలర్ల సమావేశంలో యుజిసి చైర్మన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అమలు చేసిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, క్రెడిట్ విధానాన్ని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పద్దెనిమిది కొత్త కోర్సులను ప్రారంభించామని, ప్రాక్లికల్ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వారిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద అధ్యాపకులుగా నియమించామని వెల్లడించారు. ఇందుకు కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ లిమిటెట్ సహకారాన్ని అభినందించారు. ఐదు పర్యాయాలు కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ద్వారా 99.8శాతం అధ్యాపకులకు పదోన్నతులు కల్పించామన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కు పదోన్నతి కల్పించడంలో కారుణ్య ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. రానున్న రోజుల్ల ఉస్మానియా విజయపతాకం మరింత ఎత్తుకు ఎదగాలని ఇందుకు ఉస్మానియాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి. గణేష్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News