Monday, December 23, 2024

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్ రూరల్ ః ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (బాలికల) పాఠశాలలో గురువారం మధ్యాహ్న బోజనం వికటించి 16 మంది విద్యార్థిణిలు అస్వస్థతతకు గురైయ్యారు. అస్వస్థతతకు గురైన విద్యార్ధిణీలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిచి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుణిలల్లో ఎస్సీ బాలికల హాస్టల్‌కు చెందినవారు. ఎక్కువ మంది విద్యార్థిణిలు ఉండడంతో వార్డెన్ స్వప్న వెంటనే స్పందిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు వివరణ ఇస్తూ స్కూల్ ముగిసిన తరువాత వచ్చిన వెంటనే విద్యార్థులకు కడుపు నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామన్నారు. మధ్యాహ్న బోజన నిర్వహకుల పై , ఉపాధ్యాయుల పై విద్యార్థిణిల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం విద్యార్థిణిల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ స్నేహారెడ్డి తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు సైతం విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News