Sunday, December 22, 2024

భగ్గుమన్న బాసర

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌పై బాసర వాసులు భగ్గుమన్నారు. అమ్మవారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అతడిని వెంటనే అరెస్టు చేసి పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాసర ఆలయ అర్చకులు, వేద పండితులు, పరిపాలనా సిబ్బంది కలిసి ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రెంజర్లపై ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని విద్యాసంస్థలు వ్యాపార సముదాయాలను స్వచ్చందంగా బంద్ చేసి రోడ్డుపై బైటాయించారు. కులమతాలకతీతంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు నిరసనలో పాల్గొని తమ మద్దుతు తెలిపారు. నిజామాబాద్ – బైంసా వేళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న శివాజీ చౌక్ వద్ద వాహనాలను అడ్డుకున్నారు. కలెక్టర్ ఎస్పి రావాలని రెంజర్ల రాజేష్ 24 గంటల్లో అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాసర సరస్వతి ఆలయం ముందు విద్యార్థులు రాస్తారోకో
బాసరలో నాగభూషణ విద్యాలయ విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌ని అరెస్టు చేయాలని విద్యార్థుల నిరసన అమ్మవారి ఆలయం వద్ద ర్యాలీగా తరలివచ్చి మానవహారం నిర్వహించిన సుమారు వేయి మంది విద్యార్థులు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాజేష్‌పై వెంటనే పిడియాక్టు కేసు నమోదు చేయాలని బాసర గ్రామంలోని కులమతాలకతీతంగా రాజకీయాలకతీతంగా అలాగే బాసరలోని అర్చకుల దేవస్థానం, సిబ్బంది, వర్తక వ్యాపారులు ఆటో యూనినల్ సభ్యుల, బాసర గ్రామ యువకులు రైతులు కార్మికులు కర్షకులు పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి రాస్తారోకో నిర్వహించారు.
బాసరలో కొనసాగుతున్న బంద్
బాసరలో బంద్ కొనసాగుతుంది. సరస్వతి దేవిపై రెంజర్ల రాజేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ భైంసా రహదారిపై గ్రామస్తులు వ్యాపారులు ఆటో డ్రైవర్లు, లాడ్జీల ఓనర్లు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోగా అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలకు చేసిన రాజేష్‌పై పిడి యాక్టు నమోదు చేయాలని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర ఆలయం వద్ద ఆలయ అర్చకులు పోలీస్‌స్టేషన్‌లో ఆలయ అర్చకులు అధికారులు పిర్యాదు చేశారు. అర్చకులు, అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సరస్వతి దేవి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పిడి యాక్టు అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో సుందర్శన్ గౌడ్, అర్చకులు అధికారులు, వాగ్దేవి సొసైటి సభ్యులు హోంగార్డు తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మంగళవారం ఆలయ అర్చకులు అధికారులు ర్యాలీగా స్థానిక పోలీస్‌స్టేషన్ వెళ్లి రెంజర్ల రాజేష్‌పై ఫిర్యాదు చేశారు. రెంజర్ల రాజేష్‌పై పిడి యాక్టు నమోదు చేయాలని మరోమారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు, హోంగార్డ్ వాగ్దేవి సొసైటి సిబ్బంది పాల్గొన్నారు. బాసర పోలీస్‌స్టేషన్ కేసు నమోదు చేసిన పోలీసులు. బాసర పోలీస్‌స్టేషన్‌లో ఐపిసి 153, 504 సెక్షన్‌ల కింద రెంజర్ల రాజేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News